Sirivennela - Full Video Song | Shyam Singha Roy | Nani, Sai Pallavi | Mickey J Meyer Lyrics - Anurag Kulkarni
| Singer | Anurag Kulkarni |
| Composer | Sirivennela Seetharama Sastry |
| Music | Mickey J Meyer |
| Song Writer | Sirivennela Seetharama Sastry |
Lyrics
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
డుం డక డుం డక డుం డక డుండుం
డుం డక డుం డక డుం డక డుం
నెల రాజుని ఇల రాణిని
కలిపింది కదా సిరివెన్నెల
దూరమా దూరమా తీరమై చేరుమా
నడి రాతిరిలో తెరలు తెరచినది
నిద్దురలో మగత మరచి ఉదయించినదా
కులుకులొలుకు చెలి మొదటి కలా
తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
ఓ, ఛాంగురే ఇంతటిదా నా సిరి
అన్నది ఈ శారద రాతిరి
మిలమిలా చెలి కన్నుల
తన కలలను కనుగొని
అచ్చెరువున మురిసి
అయ్యహా ఎంతటిదీ సుందరి
ఎవ్వరూ రారు కదా తన సరి
సృష్టికే అద్దము చూపగ పుట్టినదేమో
నారి సుకుమారి
ఇది నింగికి నేలకి జరిగిన పరిచయమే
తెర దాటి చెర దాటి
వెలుగు చూస్తున్న భామని
సరిసాటి ఎదమీటి
పలకరిస్తున్న శ్యాముని
ప్రియమార గమనిస్తూ
పులకరిస్తోంది యామిని
కలబోసే ఊసులే, ఓ ఓ
విరబోసే ఆశలై, ఓ ఓ
నవరాతిరి పూసిన వేకువ రేఖలు
రాసినదీ నవలా
మౌనాలే మమతలై, ఓ ఓ
మధురాలా కవితలై, ఓ ఓ
తుది చేరని కబురుల
కథాకళి కదిలెను
రేపటి కధలకు మున్నుడిలా
తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
ఇదిలా అని ఎవరైనా
చూపనేలేదు కంటికి
అదెలాగో తనకైనా
తోచనే లేదు మాటకి
ఇపుడిపుడే మనసైన
రేపు దొరికింది చూపుకి
సంతోషం సరసన, ఓ ఓ
సంకోచం మెరిసిన, ఓ ఓ
ఆ రెంటికి మించిన పరవశ లీలను
కాదని అనగలమా
ఆ, కథ కదిలే వరుసనా, ఓ ఓ
తమ ఎదలేం తడిసినా, ఓ ఓ
గత జన్మల పొడవున
దాచిన దాహము ఇపుడే
వీరికి పరిచయమా
తన నవ్వులలో తళుకు తళుకు తన చెంపలలో చమకు చమకు
తన మువ్వలలో ఝనకు ఝనకు
సరికొత్త కలా
Comments
Post a Comment